నిధుల కేటాయింపు చేపట్టాలని వినతి

81చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయా వార్డుల అభివృద్ధికి నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరుతూ కౌన్సిలర్ తౌహీదుద్దీన్ రఫ్ఫూ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ కు శనివారం వినతిపత్రం అందజేసారు. 15వ ఆర్థిక సంఘ నిధులు నిర్మల్ బల్దియాకు రావడం లేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పెండింగ్ నిధులతో పాటు తాజా కేటాయింపు నిధులు సకాలంలో వచ్చేలా చూడాలని కోరారు. నిధుల మంజూరుకు కృషి చేస్తానని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్