అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలి

85చూసినవారు
అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు అంగన్వాడీలకు రూ. 2 లక్షలు, ఆయాలకు రూ. లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి నాలుగు రోజులకు చేరుకున్నాయి. అంగన్వాడీలకు పెన్షన్ తక్కువ ఇచ్చే ఆలోచనను వెనక్కి తీసుకోవాలని కోరారు. లేనట్లయితే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్