సారంగాపూర్: పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి
సారంగాపూర్ మండలంలో మొత్తం మూడు సెంటర్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ సారంగాపూర్ లో 159 విద్యార్థులు, 9 ఇన్విజిలేటర్స్, జడ్పీహెచ్ఎస్ సారంగాపూర్ లో 199 విద్యార్థులు , 11 ఇన్విజిలేటర్స్, జడ్పీహెచ్ఎస్ బీరవెల్లి లో 41విద్యార్థులు, 4 ఇన్విజిలేటర్స్ ఉన్నారు. విద్యార్థులకు త్రాగునీరు మరుగుదొడ్లు ఇతర సదుపాయాలను కల్పించడం జరిగిందని ఎంఈఓ మధుసూదన్ తెలిపారు.