సారంగాపూర్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: జిల్లా కలెక్టర్
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. శనివారం సారంగాపూర్ మండలంలోని జాం, హనుమాన్ తాండ, చించోలి (బి) ముందస్తుగా వనమో త్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాంటేషన్ గ్రామపంచాయతీ అప్రూడ్ లేఔట్లలో మునగ మొక్కలను నాటారు. ఇందులో అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ డిఎల్పీవో అజీజ్ ఖాన్, సాగర్ గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.