సారంగాపూర్: కూలిన ఇండ్ల పరిశీలన

76చూసినవారు
సారంగాపూర్: కూలిన ఇండ్ల పరిశీలన
సారంగాపూర్ మండలం కౌట్ల (బి) శాంతినగర్ లలో భారీ వర్షాలకు కూలిన విద్యుత్ స్తంభాలు, ఇండ్లను ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు, ఆర్ఐ వెంకట నర్సయ్య లు మంగళవారం పరిశీలించారు. శాంతినగర్ లో ఐదు పేద కుటుంబాల ఇండ్ల గోడలు పైకప్పులు లేచిపోయి నేలకూలియాయి. జరిగిన నష్టాన్ని అంచనా నివేదిక రూపొందించారు. తక్షణ సహాయం కింద నిత్యవసర సరుకులను అందజేశారు.

సంబంధిత పోస్ట్