సారంగాపూర్: హిందు వాహిని ఆధ్వర్యంలో వైద్య శిబిరం

62చూసినవారు
సారంగాపూర్: హిందు వాహిని ఆధ్వర్యంలో వైద్య శిబిరం
సారంగాపూర్ మండలం వంజర్ గ్రామంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో గ్రామస్తులకు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ శివకుమార్ లు వైద్య పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శి రామ్, జిల్లా మాజీ ఆత్మ డైరెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్