కేఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ, దశరథ్, మహేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య అన్నారు. సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామానికి చెందిన కోర్వ నవీన్ రెడ్డి న్యాయవాది నెలకొల్పిన కొర్వ నవీన్ రామ క్రిష్ణ రెడ్డి ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంతోపాటు కౌట్ల, మలక్ చించోలి గ్రామాల్లోని పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ అందజేశారు.