సారంగాపూర్: కార్మికుల పక్షమే టియుసిఐ మహాసభలు
అనేక పోరాటాలు నిర్వహిస్తూ వారి పక్షాన నిలుస్తున్న టియుసిఐ ప్రథమ సభలను జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కే. రాజన్న పిలుపునిచ్చారు. సారంగాపూర్ మండలం ఆలూరు బీడీ ఫ్యాక్టరీలో పోస్టర్లను విడుదల చేశారు. వివిధ రంగాలలో కార్మికులు చేస్తున్న శ్రమకు తగ్గ ఫలితాల కోసం సంఘం పోరాడుతుందన్నారు. ఈనెల 21, 22న నిజామాబాద్ లో మహాసభలు ఉంటాయన్నారు.