విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ సమంజసమేనని, ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారితాత్మకమని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేదలకు న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని, ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలని చెప్పారు. దళితుల చిరకాల స్వప్నం నెరవేరబోతోందని హర్షం వ్యక్తం చేశారు.