సిర్గాపూర్: మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ.. రాకపోకలకు అంతరాయం
దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ వద్ద 222 జాతీయ రహదారిపై మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అయింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. పైప్ లైన్ లీకేజీ తో భారీ మొత్తంలో నీరు రోడ్డుపైకి చేరి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వాహనాచోదకులు, స్థానికులు మంగళవారం కోరుతున్నారు.