సోన్: 44 వ జాతీయ రహదారి నుండి ప్రధాన మార్గాలలో అంధకారం
సోన్ మండల కేంద్రంలో అంధకారం నెలకొంది. సోన్ జాతీయ రహదారి పైనుండి బస్టాండ్ వరకు అదే మాదిరి గ్రామంలోకి వెళ్లే పలు మార్గాలలో విద్యుత్ సరఫరా లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగైదు రోజులుగా గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. గ్రామంలోని పలు అంతర్గత వీధులలో వీధి దీపాలు ఎన్నో రోజుల నుంచి వెలగడం లేదని పేర్కొన్నారు.