సోన్: విద్యార్థులకు పుష్పగుచ్చాలతో ఉపాధ్యాయుల స్వాగతం
సోన్ మండలం పాక్ పట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. మండల విద్యాధికారి తోడిశెట్టి పరమేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారికి అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. మధ్యాహ్న భోజనం గది, తిను పదార్థాలు, మరుగు దొడ్లు, మూత్రశాలలు, పాఠశాల ఆవరణను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.