కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు సోన్ మండల కేంద్రంలో శుక్రవారం జైబాపు జైభీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్, గాంధీ, చాకలి ఐలమ్మ విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికతో ప్రదర్శన జరిపారు.