వినాయక నిమజ్జనాలను పోలీస్ సిబ్బంది తమ మండల పరిధిలో శాంతియుతంగా నిర్వహించడం అభినందనీయమని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు సక్రమంగా నిర్వర్తించిన పోలీసు సిబ్బందికి ప్రోత్సాహక పత్రాలను అందజేసి అభినందించారు.
ఇదేవిధంగా జిల్లాలో పోలీస్ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించి జిల్లాకు పేరు వచ్చేలా చేయాలని పేర్కొన్నారు.