నిర్మల్‌లో సిక్కుల ప్రత్యేక ప్రార్థనలు
నిర్మల్‌లో సిక్కుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. సిక్కుల మతపరమైన జెండా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గురువుకు తమ మతపరమైన శ్లోకాలతో నైవేద్యాలను సమర్పించుకున్నారు. ప్రతి ఏడు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించుకుంటున్నామని సర్దార్ అధర్ సింగ్, సర్దార్ జితేందర్ సింగ్, సర్దార్ ఈశ్వర్ సింగ్ పేర్కొన్నారు.