మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మృతి పార్టీకి తీరనిలోటు

75చూసినవారు
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి శనివారం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అదిలాబాద్ ఎంపీగా, జడ్పీ చైర్మన్ గా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా రమేష్ రాథోడ్ అందించిన సేవలు మరువలేనివని అన్నారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి రమేష్ రాథోడ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్