సమాజంలో గురువుల స్థానం అత్యంత ఉన్నతమైనదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం పట్టణంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యయులందరికి కలెక్టర్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.