రెండవ రోజు కొనసాగిన మున్సిపల్ కార్మికుల సమ్మె

85చూసినవారు
పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ నిర్మల్ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం రెండవ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ గత మూడు నెలల నుండి మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని వాపోయారు. వేతనాలు ఇవ్వకుంటే పండుగలు ఏ విధంగా జరుపుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, లేకపోతే విధులకు హాజరు కామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్