నాటిన మొక్కను కంటికి రెప్పలా కాపాడుకోవాలి

53చూసినవారు
నాటిన మొక్కను కంటికి రెప్పలా కాపాడుకోవాలి
నాటిన మొక్కను కంటికి రెప్పలా కాపాడుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని న్యూ లోలం గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. నాటిన మొక్కలను బాధ్యతగా రక్షించాలని ఈజిఎస్ అధికారులకు సూచించారు. ఇందులో ఏపీఏం దివ్య రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ రమణ, ఫీల్డ్ అసిస్టెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్