నిర్మల్ లో ఉరుములు మెరుపులతో వర్షం.. విద్యుత్ సరఫరా నిలిపివేత
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులతో వర్షాలు మొదలయ్యాయి. ఉక్కపోతతో కొట్టుమిట్టాడుతున్న నిర్మల్ ప్రజలకు వాతావరణం ఒకేసారి చల్లబడడంతో ఉపశమనం లభించింది. ఉరుములు మెరుపులతో వర్షం మొదలవడంతో విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం ఆయా ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను ముందస్తుగా నిలిపివేశారు.