పోషణ అభియాన్ కు సంబంధించిన పోషణ
మాసం కార్యక్రమంలోని నిర్ధేశిత లక్ష్యాలు ప్రణాళికా బద్ధంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోషణ మాసం కార్యక్రమం పై అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకు పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా వారాల వారిగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.