10న నిర్మల్ కు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రాక
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ ప్రాంతంలో గల విజయ హై స్కూల్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 10న నిర్వహించే కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి హాజరవుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత నల్ల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఎంపీ జి. నగేష్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, తదితరులు హాజరవుతారన్నారు.