నిర్మల్‌లో నిరాడంబరంగా టీఎస్ యుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవం
నిర్మల్ పట్టణంలోని టీఎస్ యుటిఎఫ్ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. 12వ ఆవిర్భావ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల అధికారిగా నియమించబడిన మూడారపు పరమేశ్వరుని ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ సమస్యలపై నిత్య పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నామని వక్తలు పేర్కొన్నారు. ఇందులో జిల్లా అధ్యక్షులు దాసరి శంకర్, ప్రధాన కార్యదర్శి పెంట అశోక్, రాజు నాయక్, కే. నాగయ్య, వీరేష్, రవి, గణపతి, బలరాం, ఫాజిల్ లు ఉన్నారు.