నిర్మల్ పట్టణంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డిఎస్పి గంగారెడ్డి తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు పట్టణ ఎస్ఐ రమేష్ సిబ్బందిలో మంచిర్యాల చౌరస్తాలో గల చాచా టీ సెంటర్ వద్ద ఉండగా చౌస్ అబ్రార్, షేక్ రఫీ వ్యక్తులు గంజాయి తీసుకుని తమ కస్టమర్లకు అమ్మడానికి వెళుతుండగా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.