యూరియా ఎరువులు సరైన మోతాదులో వాడాలి

80చూసినవారు
యూరియా ఎరువులు సరైన మోతాదులో వాడాలి
పంటలపై యూరియాను అధికంగా వాడటం వల్ల భూమి, పంట నాణ్యత, పర్యావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఏ ఈఓ అంబాజీ నాయక్ అన్నారు. సోన్ మండలం కూచన్ పల్లి గ్రామంలో రైతులను అధికంగా యూరియా వాడితే కలిగే అనర్థాలపై మంగళవారం అవగాహన కల్పించారు. యూరియా అధికంగా వాడటం వల్ల మొక్క ఎక్కువ పచ్చగా, ఎక్కువ మెత్తగా మారుతుందని, దీంతో చీడపీడలు అధికమయ్యే అవకాశముందని అన్నారు. యూరియా ఎరువులు సరైన మోతాదులో వాడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్