వైభవంగా వరలక్ష్మి వ్రతం

58చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ నందిగుండం దుర్గా మాత ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించి వాయినం ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్