అన్ని విధాల ఆదుకుంటాం: ఎమ్మెల్యే

79చూసినవారు
అన్ని విధాల ఆదుకుంటాం: ఎమ్మెల్యే
బాధితులు ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని.. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే లోతట్టు ప్రాంతమైన జిఎన్ఆర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను పరిశీలించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలలోకి తరలించాలని సూచించారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. వారి వెంట బిజెపి నాయకులు ఉన్నారు.