ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధుల పదవికాలం ముగిసినందున ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, ప్రభుత్వ మిత్రులకు లోబడి పని చేయాలని సూచించారు.