కార్మికుల డిమాండ్స్ డే జయప్రదం చేయాలి

84చూసినవారు
వచ్చే నెల జులై 9న నిర్వహించే కార్మికుల డిమాండ్స్ దినోత్సవం జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి రాములు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. సహజ వనరులైన బొగ్గు బావులను ప్రైవేటీకరణకు సిద్ధమైందని మండిపడ్డారు. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి డిమాండ్స్ డే నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్