జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారిణి నిషిక అగర్వాల్ సత్తా చాటింది. అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో ఆమె స్వర్ణ పతకంతో మెరిసింది. నిన్న జరిగిన టేబుల్ వాల్ట్‌లో నిషిక (12.717 పాయింట్లు) అగ్రస్థానం సాధించింది. రెజ్లింగ్‌లో తెలంగాణ ఆటగాడు నిఖిల్ యాదవ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్యంకోసం జరిగిన పోరులో కర్ణాటక రెజ్లర్‌పై నిఖిల్ పైచేయి సాధించాడు.