టాలీవుడ్ హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. కాగా, నేడు రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ నుంచి మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇక, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.