ఇప్పటికే ప్రమాదకరంగా మారిన 'నిఫా' వైరస్‌ను కేవలం నిమిషాల్లోనే గుర్తించగలిగే టెస్ట్ కిట్‌ను ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) అభివృద్ధి చేసింది. ఈ కిట్ ద్వారా త్వరితగతిన పరీక్షలు నిర్వహించి వైరస్ ఉనికిని నిర్ధారించవచ్చు. ముఖ్యంగా నిఫా ప్రమాదం ఎక్కువగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ కిట్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తామని ఎన్ఐవీ డైరెక్టర్ డా.నవీన్ కుమార్ తెలిపారు.