మూడున్నరేళ్లకే వండర్‌ కిడ్‌గా పేరొందిన నిజామాబాద్ బాలుడు

51చూసినవారు
మూడున్నరేళ్లకే వండర్‌ కిడ్‌గా పేరొందిన నిజామాబాద్ బాలుడు
TG: నిజామాబాద్‌కు చెందిన మూడున్నరేళ్ల విరాజ్ వండర్ కిడ్ అనిపించుకుంటున్నాడు. తన జ్ఞాపకశక్తితో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. విరాజ్ అనే బాలుడు మాటలు నేర్చుకుంటున్నప్పుడే తల్లిదండ్రులు చెప్పిన మాటలను అలాగే తిరిగి చెప్పేవాడు. దీంతో వారు వివిధ సంస్థలను సంప్రదించగా.. విరాజ్‌ జ్ఞాపక శక్తిని పరీక్షించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు టెస్ట్‌ పెట్టారు. ఇందులో విరాజ్‌ 16 శ్లోకాలు, 14 ఆంగ్ల పద్యాలు, 20 ఆంగ్ల పదాలు చెప్పి రికార్డు సాధించాడు.

సంబంధిత పోస్ట్