తృటిలో తప్పిన ప్రమాదం
జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు బురదలో ఇరుక్కుపోయింది. వర్షాలకు రోడ్డంతా బురదమయమవడంతో గ్రామం మీదుగా వెళ్లే బస్సు గురువారం బురదలో ఇరుక్కుంది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. అధికారులు స్పందించి గ్రామంలో రోడ్డు వేయించాలని ప్రయాణికులు కోరారు.