ఆలూరు మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కొరకు ఆలూరు నుండి అమెరికాలో నివాసం ఉంటున్న గుర్రం త్రివేణి మల్లేష్ గౌడ్ రూ. 1,15,000 విరాళం శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పెద్ద మనసుతో విరాళం ఇచ్చిన మల్లేష్ గౌడ్ వారి కుటుంబ సభ్యులను సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దాతలతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, మెడికల్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.