ప్రభుత్వం నిర్వహిస్తున్న"ప్రొఫెసర్ జయశంకర్" బడిబాట కార్యక్రమానికి అంకాపూర్ లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులలో ప్రభుత్వ పాఠశాలలో బోధించే విద్య పట్ల నమ్మకం పెంచి విద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు. అలాగే విలువలతో కూడిన విద్య అందించి విద్యార్థుల ఉత్తీర్ణశాతం పెంచి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేయాలన్నారు.