ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని, ఆదివారం దొంకేశ్వర్ మండల అన్నారం గ్రామంలో దాత ఆదిభట్ల సీఐ రఘువీర్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన 13 సీసీ కెమెరాలను ఆలయ కమిటీ సభ్యులు కలిసి ఆయన ప్రారంభించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సీసీ కెమెరాలు అందుబాటులోనికి వస్తున్నట్లు తెలిపారు.