వేసవి కాల సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పున: ప్రారంభమైన సందర్భంగా మధ్యాహ్న భోజనమును పకడ్బందీగా నిర్వహించాలని మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్లడిలో మధ్యాహ్న భోజనమును ఆకస్మిక తనిఖీ చేసినట్లు ఆలూర్ మండల విద్యాశాఖాధికారి ఏం నరేందర్ తెలిపారు. వంటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.