మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆలూర్ లో ఒకటవ తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమము శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆలూర్ మండల విద్యాశాఖాధికారి ఎం నరేందర్ పాల్గొని తన కరకమలములచే విద్యార్థులకు అక్షరభ్యాసం చేయించారు. అనంతరం విద్యార్థులకు నోటుబుక్స్, పాఠ్యపుస్తకములు, స్కూల్ యూనిఫామ్స్, అందజేయడం జరిగింది.