ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన గుండ్ల కులస్తుడు బట్టు నాగార్జున అను వ్యక్తి బతుకుదెరువు కోసం దుబాయ్ (అబుదాబి) దేశానికి వెళ్ళినాడు. అక్కడ నాగార్జున సుమారు నెలరోజుల క్రితం తప్పిపోయాడు. ఇప్పటివరకు అతని ఆచూకీ లభించలేదు. వీరి కుటుంబ పరిస్థితి బాగోలేనందున శుక్రవారం చేపూర్ గ్రామానికి చెందిన గౌడ సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షుడు గడ్డమీది లింగం గౌడ్ వారి కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయం చేశారు.