అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరగనున్నాయని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల నివారణకు పలు జాగ్రత్తలు వహించాలని ఫైర్ స్టేషన్ అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.