ఆర్మూర్ పరిసర ప్రాంతాల ప్రజలు పోగొట్టుకున్న ఫోన్ లను ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో సీఐ సత్యనారాయణ శుక్రవారం బాధితులకు అప్పగించారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సేకరించామని ఆర్మూర్ ఎస్హెచ్ఓ తెలిపారు. సుమారు పది మొబైల్ ఫోన్ లను సేకరించి బాధితులకు అప్పగించామని అన్నారు. ఈ సందర్భంగా బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.