ఆర్మూర్ పట్టణంలోని జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కేజీబీవీ స్కూల్ ని సందర్శించడం జరిగింది. పిల్లలతో కలిసి తినడం జరిగింది. అలాగే వండిన అన్నం, కూర, పప్పుని కూడా పరిశీలించారు. పాఠశాల పరిసరాలు, డార్మెటరీ బాత్రూంలు, వంటగది ముఖ్యంగా పిల్లలకు వడ్డించే భోజనం పరిశీలించడం జరిగింది. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బాత్రూంలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించడం జరిగింది.