ఆర్మూర్ పట్టణంలో గల సెంట్ పాల్ హైస్కూల్లో ఆదివారం జరుగుతున్న గ్రూప్ 3 ఎగ్జామ్ రాయటానికి ఒక మహిళ ఆమె కుమారున్ని తీసుకొని వచ్చింది. అయితే తనతో పాటు బాబును ఎగ్జామ్ సెంటర్ లోని అనుమతించలేదు అధికారులు. తనతో బంధువులు ఎవరూ లేకపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ సలీం బాబు తల్లి వచ్చేవరకు అతని వద్ద ఉంచుకున్నాడు. ఇది చూసిన పలువురు ఎస్ఐని అభినందించారు.