ఆర్మూర్: దేవాలయాల దాడులపై నిరసనగా మహాధర్నా

80చూసినవారు
ఆర్మూర్: దేవాలయాల దాడులపై నిరసనగా మహాధర్నా
అంకాపూర్ గ్రామ హిందూ సమితి అధ్యక్షులు సల్ల బొరయ్య ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై నిరసనగా మహాధర్నాను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంకాపూర్ హిందూ సమితి అధ్యక్షులు సల్ల బొరయ్య, ప్రముఖ న్యాయవాది జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరగడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లుగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్