ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం సేఫ్ ఇండియాలో భాగంగా శుక్రవారం రోడ్డు సేఫ్టీ అవగాహన ర్యాలీని పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు సేఫ్టీ మరియు ట్రాఫిక్ నిబంధనలు గురించి నినాదాలతో హోరెత్తించారు. మరియు హెల్మెట్ లేని, సీట్ బెల్ట్ ధరించని ప్రయాణికులకు గులాబి పుష్పం ఇచ్చి హెల్మెట్ ఎందుకు ధరించాలో వివరించారు.