ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమన్ ప్రాంగణంలో గల ఆర్మూర్ అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప నిత్య అన్నప్రసాద భిక్ష వితరణ నవంబర్ 25వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు కొనసాగింది. ఇది 18వ సారి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమం గురుస్వామి శర్మ ఆధ్వర్యంలో జరుగుతుంది అన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన దాతలను అయ్యప్ప సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి, ధన్యవాదాలు తెలిపారు.