ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మంగళవారం ఆదివాసి నాయక పోడు సేవా సంఘం అధ్యక్షుడిగా మీనుగు రంజిత్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామంలో భీమన్న గుడిని అందరి సహకారంతో నిర్మిస్తానని, ఆదివాసులకి వచ్చే అన్ని ప్రభుత్వ పథకాలను అమలయ్యే విధంగా చూస్తానని నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన కుల పెద్దలకు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.