ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వినయ్ రెడ్డి మర్యాదపూర్వకంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావులను ఆదివారం కలిశారు. అనంతరం వారితో సమావేశంలో పాల్గొని నియోజకవర్గ సమస్యలపై చర్చించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.