ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులను నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిధులు మంజూరు చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రూ. 20లక్షలు మంజూరు అయింది అని 10లక్షల రూపాయలతో స్మశాన వాటికకు సీసీ రోడ్డు వేయడం జరుగుతుందన్నారు. మిగతా పది లక్షలతో సీసీ రోడ్లు లేని కాలనీలోకి రోడ్డు వేయడం జరుగుతుందన్నారు.